కోవిడ్ బాధితులకు అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో పిటీషన్

ABN , First Publish Date - 2020-09-14T18:29:01+05:30 IST

కోవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

కోవిడ్ బాధితులకు అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో పిటీషన్

అమరావతి: కోవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. గుంటూరు వాసి సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు వాయిదా ఇవ్వాల్సిందిగా అదనపు అడ్వకేట్ జనరల్ కోరడంతో పిటిషన్‌‌పై విచారణను ఉన్నత న్యాస్థాయం వచ్చే వారానికి వాయిదా వేసింది. పిటీషన్ తరపున  న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

Updated Date - 2020-09-14T18:29:01+05:30 IST