ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వివాదంపై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ

ABN , First Publish Date - 2020-06-25T23:51:54+05:30 IST

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వివాదంపై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో 67శాతమే కచ్చితత్వం ఉన్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ పేర్కొంది. శరీరంలో నూరుశాతం వైరస్‌ ఉంటేనే ఫలితం పాజిటివ్‌గా వస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వివాదంపై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ

అమరావతి: ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వివాదంపై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో 67శాతమే కచ్చితత్వం ఉన్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ పేర్కొంది. శరీరంలో నూరుశాతం వైరస్‌ ఉంటేనే ఫలితం పాజిటివ్‌గా వస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది. రివకరీ దశలో ఉన్నా, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ స్థాయి 33శాతమే ఉన్నా ఫలితం నెగెటివ్‌ వస్తుందని వివరించింది. మొదటిసారి దీపక్‌రెడ్డికి నూరుశాతం వైరల్‌ ఇన్ఫెక్షన్‌ ఉండి పాజిటివ్‌ వచ్చిందని, రెండోసారి రికవరీ దశలో ఉన్నందున నెగెటివ్‌ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated Date - 2020-06-25T23:51:54+05:30 IST