హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-03-17T02:52:12+05:30 IST
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం
ఢిల్లీ: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగుల అంశాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు ఉన్న రంగుల స్థానంలో వేరే రంగులు వేయాలంటూ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.