కరోనాపై ఇంత ఉదాసీనతా?

ABN , First Publish Date - 2020-03-19T08:32:16+05:30 IST

‘‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విషయంలో మీరు ఇంత ఉదాసీనంగా మాట్లాడతారా? మన రాష్ట్రంలో లేదు, వైర్‌సలు వస్తాయి, పోతాయని అంటారా? ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మ హమ్మారిగా ...

కరోనాపై ఇంత ఉదాసీనతా?

  • ప్రపంచం హడలుతుంటే మీకు పట్టదా?
  • సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్న


అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విషయంలో మీరు ఇంత ఉదాసీనంగా మాట్లాడతారా? మన రాష్ట్రంలో లేదు, వైర్‌సలు వస్తాయి, పోతాయని అంటారా? ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మ హమ్మారిగా ప్రకటించాక కూడా తేలిగ్గా తీసుకోవడం సరికా దు. వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికే ప్రాధా న్యం ఇవ్వండి’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సీఎం జగన్‌కు సూచించారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చే శారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్ర్కీనింగ్‌ సెంటర్లు, ఐసోలేషన్‌ వార్డులు, ల్యాబులు పెంచాలన్నారు. రాజకీయాల కో సం కరోనా విషయంలో ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోవడం సరికాదని హితవు పలికారు. జనసేన తరఫున కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. 

Updated Date - 2020-03-19T08:32:16+05:30 IST