ఏపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి తగ్గలేదా?

ABN , First Publish Date - 2020-08-21T00:25:00+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ఇప్పటికీ మార్చలేదు. గ్రామ సచివాలయాలు,..

ఏపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి తగ్గలేదా?

ఏపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి తగ్గలేదా?. హైకోర్టు చివాట్లు పెట్టినా..సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులనే కొనసాగిస్తోందా?. 


ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ఇప్పటికీ మార్చలేదు. గ్రామ సచివాలయాలు, ట్యాంకులు, ఆకరికి బోరు పంపులకు వేసిన రంగులు అలాగే ఉన్నాయి. విజయనగరం జిల్లా ఇప్పటికీ జిల్లాలోని చాలా ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా వైసీపీ రంగులే ఉన్నాయి. కనీసం  వీటిని తొలగించేందుకు అధికారులు ముందుకు రావడంలేదు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయనగరం జిల్లా నలుమూలల పంచాయతీ కార్యాలయాలతో పాటు అక్కడున్న బోరింగులకు, ఆకరికి బాపూజీ విగ్రహాలకు వైసీపీ రంగులు పులిమారు. సుప్రీం కోర్టు చివాట్లతో కొంతమేర కనిపించకుండా చేశారు. కానీ చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా వైసీపీ రంగులే కనిపిస్తున్నాయి. ఒక పార్టీ రంగులు ప్రభుత్వ ఆస్తులకు ఉండకూడదని పదే పదే చెప్పినప్పటికీ అధికారులు మాత్రం చెవికెక్కనట్లు వ్యవహరిస్తున్నారు. 


Updated Date - 2020-08-21T00:25:00+05:30 IST