ఆహార శుద్ధి పరిశ్రమలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2020-06-04T23:28:23+05:30 IST

రాష్ట్రంలోని ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారు.

ఆహార శుద్ధి పరిశ్రమలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

విజయవాడ : రాష్ట్రంలోని ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారు. జగన్ ఆదేశాల మేరకు స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఆఫీసులో మంత్రులు బుగ్గన, బొత్స, కన్నబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న, మధ్య తరహా ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల ఫుడ్ ప్రాసెస్సింగ్, అగ్రి పరిశ్రమల ఆధారాలు సేకరించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెస్సింగ్ జోన్స్ ఏర్పాటుకు తగిన నివేదిక తయారు చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-06-04T23:28:23+05:30 IST