-
-
Home » Andhra Pradesh » ap govt cs cpi ramakrishna letter demand resign
-
‘నైతిక విలువలు ఉంటే సీఎస్ తక్షణమే రాజీనామా చేయాలి’
ABN , First Publish Date - 2020-03-23T13:42:40+05:30 IST
సీఎస్ పదవికి నీలం సాహ్నీ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే సీఎస్ పదవికి రాజీనామా

విజయవాడ: సీఎస్ పదవికి నీలం సాహ్నీ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే సీఎస్ పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ తన లేఖలో డిమాండ్ చేశారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. కరోనా ప్రభావం ఏపీలో 3 వారాల పాటు ఉండదని, ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయటాన్ని ఆయన తప్పుపట్టారు. స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే జనతా కర్ఫ్యూ ఏపీలో జరిగేది కాదన్నారు. కరోనా తీవ్రత పెరిగి ప్రపంచంలో అభాసుపాలయ్యేవాళ్లం అని పేర్కొన్నారు. ఎవరి సలహా ప్రకారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారని సీఎస్‌ను ఆయన ప్రశ్నించారు. పదవి కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి చెప్పినట్లు లేఖ రాశారా? అని అన్నారు. ఎన్నికలు నిర్వహించి ఉంటే ఒక చారిత్రక తప్పిదానికి మీరు మూల కారణం అయ్యేవారు అని సీఎస్‌కు రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.