ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 81 కేసులు
ABN , First Publish Date - 2020-04-26T17:31:16+05:30 IST
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది.

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో(శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు) 81 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1097 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 231 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, 31 మంది కోవిడ్-19 బారిన పడి మరణించారని ప్రభుత్వం తన గణాంకాల్లో పేర్కొంది. ప్రస్తుతం 835 మంది చికిత్స పొందుతున్నారని ఏపీ సర్కారు తెలిపింది. అలాగే జిల్లాల వారీగా కోవిడ్-19 కేసుల వివరాలను కూడా విడుదల చేసింది. ఆ వివరాలు కింది పట్టికలో...
