అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిని విస్తరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ABN , First Publish Date - 2020-04-25T15:54:34+05:30 IST
రాష్ట్రంలో పలు అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: రాష్ట్రంలో పలు అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి 8 మండలాల్లోని 65 గ్రామాలను చేర్చింది. అలాగే కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి 31 మండలాల్లోని 477 గ్రామాలు, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి 38 మండలాల్లోని 316 గ్రామాలను చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.