దేశంలోనే తొలిసారి ఆన్‌లైన్ ప్రసంగం.. ఏపీ అసెంబ్లీలో!
ABN , First Publish Date - 2020-06-16T15:32:32+05:30 IST
మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం.

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం. అయితే ఈ సారి కరోనా మహమ్మారి నేపథ్యంలో గవర్నర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. అయితే ఆయన రాజ్‌భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇలా ఒక గవర్నర్ ఆన్‌లైన్ ద్వారా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం అనేది దేశంలో ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ప్రసంగ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరయ్యారు.