వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-08-20T14:05:53+05:30 IST

వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని సర్కార్ కోరింది.

వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

అమరావతి: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని సర్కార్ కోరింది. బహిరంగ ప్రదేశాలకు బదులుగా ఇంట్లో పూజలు చేయాలని ప్రజలకు వినతి చేసింది. సర్కార్ ఉత్తర్వులతో ఇక గణేష్ మండపాలను అనుమతులు లేనట్టుగా స్పష్టమైంది. అలాగే పూజా సామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేవాలయాల్లో కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాటించాలని పేర్కొంది. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వలు ఇచ్చిన మార్గదర్శకాలను దేవాదాయ శాఖ పరిశీలించింది.

Updated Date - 2020-08-20T14:05:53+05:30 IST