దళితలను అణగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: విజయ్ కుమార్

ABN , First Publish Date - 2020-05-29T22:15:09+05:30 IST

దళితలను అణగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: విజయ్ కుమార్

దళితలను అణగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: విజయ్ కుమార్

విశాఖపట్నం: డాక్టర్ రామిరెడ్డిపై దళిత నాయకుడు పుచ్చా విజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. సుధాకర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డి వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడని విజయ్ కుమార్ మండిపడ్డారు. ఒక డాక్టర్ గా తన‌ బాధ్యతను మరిచి సుధాకర్ ను భయపెట్టేవిధంగా మాట్లాడడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. సుధాకర్ ను మభ్యపెట్టే విధంగా మాట్లాడాల్సిన అవసరం రామిరెడ్డికి ఏంటి అని, దళితలను అణగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పుచ్చా విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-29T22:15:09+05:30 IST