కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-26T01:06:38+05:30 IST

కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి రానుంది. 2,934 మద్యం దుకాణాలను మరో ఏడాది కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి రానుంది. 2,934 మద్యం దుకాణాలను మరో ఏడాది కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి అన్ని మద్యం దుకాణాలు.. తమ ఆధీనంలో ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుపతిలోని అలిపిరి, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో.. మద్యం దుకాణాలకు అనుమతి లేదని ప్రభుత్వం తెలిపింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ అనుమతితో లిక్కర్‌ మాల్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-09-26T01:06:38+05:30 IST