ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది: మస్తాన్ వలీ
ABN , First Publish Date - 2020-05-30T02:19:15+05:30 IST
ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్ కుట్ర పూరితంగా ఉందని ఎప్పుడో చెప్పామని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించదని

అమరావతి: ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్ కుట్ర పూరితంగా ఉందని ఎప్పుడో చెప్పామని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించదని ఆయన హెచ్చరించారు. జీవోలతో ఏపీ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని, కనగరాజ్, గవర్నర్‌ను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు. 63 కేసుల్లో కోర్టు మొట్టికాయలు వేసినా.. జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రానికి సుప్రీంకోర్టు అనేక కేసుల్లో మొట్టికాయలు వేసినా ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడలేదని మస్తాన్ వలీ ఆరోపించారు.