నేడు సున్నా వడ్డీ పథకం ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-24T12:30:39+05:30 IST

నేడు సున్నా వడ్డీ పథకం ప్రారంభం

నేడు సున్నా వడ్డీ పథకం ప్రారంభం

నెల్లూరు: పొదుపు సంఘాల అప్పుల వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించడానికి ప్రవేశ పెట్టిన సున్నా వడ్డీ పథకం శుక్రవారం ప్రారంభం కానుంది. నెల్లూరు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్లో అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాలలో  ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకంపై పొదుపు సంఘాలకు సీఎం లేఖలు రాశారు. ఈ లేఖలు గ్రామ సమాఖ్యల ద్వారా మహిళా సంఘాలకు అందచేసే ఏర్పాట్లు చేశారు. ఈ పథకం ప్రారంభం అనంతరం పొదుపు సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. జిల్లాలో సున్నావడ్డీకి అర్హమైన గ్రూపులు 34,051 కాగా, అందులో సభ్యులు 3.52 లక్షల మంది ఉన్నారు. ఈ గ్రూపులకు సున్నా వడ్డీ చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.65.59 కోట్లు మంజూరు చేసింది.

Updated Date - 2020-04-24T12:30:39+05:30 IST