‘ఏపీ ఫైట్స్‌ కరోనా.కాం

ABN , First Publish Date - 2020-10-04T08:16:25+05:30 IST

కరోనా కాలంలో వివిధ వర్గాల ప్ర జలు తమ సమస్యలు, బాధలు చెప్పుకోవడానికి టీడీపీ ఒక

‘ఏపీ ఫైట్స్‌ కరోనా.కాం

మీ బాధల్ని వింటుంది

వెబ్‌ సైట్‌ను ఆవిష్కరించిన   టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు


అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి ): కరోనా కాలంలో వివిధ వర్గాల ప్ర జలు తమ సమస్యలు, బాధలు చెప్పుకోవడానికి టీడీపీ ఒక వేదిక ఏర్పాటు చే సింది. ‘ఏపీ ఫైట్స్‌ కరోనా.కాం’ పేరుతో  వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసినట్లు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


కరోనా కాలంలో ఆదాయాలు పడిపోయిన వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు, జీవనోపాధి దెబ్బతిన్నవారు, సరైన వైద్య సదుపాయం పొందలేక పోతున్నవారు, మందులు లభ్యం కానివారు ఇలా ఏ సమస్య వచ్చినా ఈ వేదిక ద్వారా తెలపాలని బాబు కోరారు. 


Updated Date - 2020-10-04T08:16:25+05:30 IST