ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో మృతి
ABN , First Publish Date - 2020-08-01T21:23:41+05:30 IST
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా వల్ల కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా..

విజయవాడ: బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత, చంద్రబాబు కేబినెట్లో బీజేపీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014 నుంచి 2018 వరకూ ఆయన మంత్రిగా పనిచేశారు.