-
-
Home » Andhra Pradesh » AP EmCet results on 9
-
టీ-ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా
ABN , First Publish Date - 2020-10-07T10:03:20+05:30 IST
తెలంగాణ ఎంసెట్-2020 ఇంజనీరింగ్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌టెన్ ర్యాంకుల్లో

టాప్ టెన్‌లో ఐదు ర్యాంకులు కైవసం
2, 3, 7, 9, 10 మనోళ్లకే
9న ఏపీ ఎంసెట్ ఫలితాలు
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎంసెట్-2020 ఇంజనీరింగ్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌టెన్ ర్యాంకుల్లో 2, 3, 7, 9, 10 ర్యాంకులు సాధించారు. ఇక, ప్రథమ ర్యాంకు సాధించిన వారణాసి సాయితేజ ఏపీకి చెందిన విద్యార్థి. అయితే, ఏడో తరగతి నుంచి తెలంగాణలోనే చదువుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అమ్మ ప్రోత్సాహంతోనే రెండో ర్యాంక్!
ఏలూరు లక్ష్మివారపుపేటలో ఉంటాం. మా నాన్న నా బాల్యంలో మృతి చెందారు. మా అమ్మ సరోజినీ దేవి ప్రోత్సాహంతోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 32వ ర్యాంకు సాధించా. ఇప్పుడు టీ-ఎంసెట్‌లో ద్వితీయ ర్యాంకు లభించింది. ఐఐటీ-బాంబేలో చేరతా.
కె.యశ్వంత్‌సాయి(టీ-ఎంసెట్ 2వ ర్యాంకర్)
నాన్న కష్టానికి ఫలితం
మాది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామం. మా నాన్న శ్రీనివాసరావు రైతు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 457వ ర్యాంకు వచ్చింది. ఇప్పుడు మూడో ర్యాంకు సాధించా. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో జాయినవుతా.
టి. మణివెంకటకృష్ణ(టీ-ఎంసెట్ 3వ ర్యాంకర్)
కంప్యూటర్ సైన్స్‌లో చేరతా!
కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీశంకరపురం మా ఊరు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జాతీయ స్థాయి 11వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 307వ ర్యాంకు వచ్చింది. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్సెస్‌లో చేరతా.
తవ్వా కృష్ణకమల్(టీ-ఎంసెట్ 7వ ర్యాంకర్)
ప్రణాళిక ప్రకారం చదివా!
మాది గుంటూరు. 9వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 57వ ర్యాంకు సాధించా. బాంబే ఐఐటీలో సీఎస్‌ఈ చేరతా. ప్రణాళికా బద్ధంగా చదవడంతో ఈ విజయం సాధ్యమైంది.
సాయిపవన్ హర్షవర్ధన్(టీ-ఎంసెట్ 9వ ర్యాంకర్)
కష్టపడితే విజయం తథ్యం!
మాది విశాఖలోని అక్కయ్య పాలెం. మా నాన్న ఏఐఆర్‌లో పనిచేస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌లో 89వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 229వ ర్యాంకు, బీఆర్క్‌లో 95వ ర్యాంకు, బీప్లానింగ్‌లో ఆలిండియాలో నాలుగో ర్యాంకు సాధించా.
వారణాసి వచన్‌సిద్దార్థ్(టీ-ఎంసెట్ 9వ ర్యాంకర్)