-
-
Home » Andhra Pradesh » AP Election Comission Gives Shock To MLA Kethireddy
-
వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాకిచ్చిన ఈసీ
ABN , First Publish Date - 2020-03-14T02:42:26+05:30 IST
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొరడా విసురుతోంది.

అమరావతి : ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొరడా విసురుతోంది. తాజాగా.. తాడిపత్రి శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆదేశించించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మార్చి 8న కేతిరెడ్డి.. తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో చీరలు, బట్టలు పంచిపెట్టినట్లు ఫీర్యాదు రావడం జరిగిందని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.
ఈ సంఘటనపై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తాడిపత్రి మునిసిపాలిటీలోని శ్రీరాముల పేటలో వాకబు చేసి, వాస్తవాలను నిర్ధారించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్రంలో 7నుంచి అమల్లోకి వచ్చినందున, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయడం తీవ్రంగా పరిగణించడమైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. పెద్దారెడ్డి మార్చి 15 న ఒక రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుడదని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో రమేష్ కుమార్ తెలిపారు. కాగా ఈ ఎన్నికల్లో పెద్దారెడ్డి కుమారుడు పోటీ చేస్తుండగా.. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో షాకిచ్చినట్లయ్యింది.