నేడు వారికి మాత్రం నిబంధనల నుంచి సడలింపు: ఏపీ డీజీపీ

ABN , First Publish Date - 2020-03-24T14:26:54+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు పని చేస్తున్న కారణంగా కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు..

నేడు వారికి మాత్రం నిబంధనల నుంచి సడలింపు: ఏపీ డీజీపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు పని చేస్తున్న కారణంగా కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నిబంధనల నుంచి సడలింపు ఉంటుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణించవచ్చని వెల్లడించారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరు, కార్లలో డ్రైవర్ మినహా ఇద్దరికి, ఆటోలో ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. కోర్టుకు వెళ్లే సిబ్బంది సాధ్యమైనంత మేర గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని ఏపీ డీజీపీ సూచించారు.Read more