అంతర్ రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: ఏపీ డీజీపీ

ABN , First Publish Date - 2020-06-01T12:48:45+05:30 IST

అంతర్ రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: ఏపీ డీజీపీ

అంతర్ రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: ఏపీ డీజీపీ

అమరావతి: అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై తదుపరి నిర్ణయం  తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని తెలిపారు.  ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రానికి రావాలనుకునే ప్రయాణీకులు  ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.   కరోన ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుందని తేల్చిచెప్పారు. 


కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని... పాజిటివ్ అని తేలితే కోవిడ్ ఆస్పత్రికి, నెగిటివ్ వస్తే మరో ఏడు రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ సవాంగ్ మరోసారి స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-01T12:48:45+05:30 IST