అంతర్వేది ఘటనపై డీజీపీ ప్రకటన ఇదీ...

ABN , First Publish Date - 2020-09-07T03:40:14+05:30 IST

అంతర్వేదిలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన సంచలనం రేపుతున్న విషయం విదితమే...

అంతర్వేది ఘటనపై డీజీపీ ప్రకటన ఇదీ...

అమరావతి : అంతర్వేదిలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన సంచలనం రేపుతున్న విషయం విదితమే. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు తక్షణమే స్పందించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలోనీ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని తక్షణం మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. జిల్లా ఎస్పీ, ఏలూరు డీఐజీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిచారు. ఇప్పటికే విజయవాడ నుంచి ఫోరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలో ఫోరెన్సిక్ లాబరేటరీ మరియు అగ్ని ప్రమాదాల వివరాలను సేకరించే నిపుణులైనటువంటి అధికారుల బృందం సంఘటనా స్థలానికి బయలుదేరింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో వివరాలను సాక్ష్యాధారాలను సేకరించేందుకు పనిలో అధికారులు నిమగ్నమయ్యారుఅని డీజీపీ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-09-07T03:40:14+05:30 IST