రెండో రోజూ కోర్టుకు ఏపీ సీఎస్‌

ABN , First Publish Date - 2020-05-30T08:58:21+05:30 IST

గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులకు సంబంధించి కోర్టు ధిక్కారం కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వరుసగా రెండో రోజు హైకోర్టు ముందు హాజరయ్యారు. ..

రెండో రోజూ కోర్టుకు ఏపీ సీఎస్‌

ద్వివేది, గిరిజా శంకర్‌ కూడా


అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులకు సంబంధించి కోర్టు ధిక్కారం కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వరుసగా రెండో రోజు హైకోర్టు ముందు హాజరయ్యారు. ఆమెతోపాటు పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ కూడా కోర్టుకు వచ్చారు. ఈ కేసు లో గురువారం ఈ ముగ్గురు ఉన్నతాధికారులు కౌంటర్‌ అఫిడవిట్లు దా ఖలు చేశారు. 


విచారణకు స్వయంగా హాజరు కావడంపై మినహాయింపునివ్వాలని అభ్యర్థించారు. పాతరంగులతోపాటు... కొత్తగా ఎర్రమట్టిరంగును చేర్చుతూ ఇచ్చిన జీవో 623ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని, అక్కడ విచారణ పెండింగ్‌లో ఉందని చెప్పడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే శుక్రవారం కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ఇక్కడి విచారణనూ వాయిదా వేసింది. ఈసారి విచారణకు సీఎ్‌సతోపాటు మిగిలిన ఇద్దరి హాజరుపై మినహాయింపునిచ్చింది.

Updated Date - 2020-05-30T08:58:21+05:30 IST