వీర జవాన్లకు మండలి నివాళి
ABN , First Publish Date - 2020-06-18T08:26:05+05:30 IST
భారత - చైనా సరిహద్దులో మంగళవారం తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ సహా 20 మంది మరణించడంపై శాసనమండలి సంతాపాన్ని ప్రకటించింది...
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): భారత - చైనా సరిహద్దులో మంగళవారం తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ సహా 20 మంది మరణించడంపై శాసనమండలి సంతాపాన్ని ప్రకటించింది. ఎమ్మెల్సీ మాధవ్ ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని చైర్మన్ ఎం ఏ షరీఫ్ ఆమోదించారు. వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సభ మూడు నిమిషాల పాటు మౌనం పాటించి, సంతాపాన్ని ప్రకటించింది.