ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు...శ్రీకాకుళంలో తొలి కేసు

ABN , First Publish Date - 2020-04-25T17:51:59+05:30 IST

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు...శ్రీకాకుళంలో తొలి కేసు

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు...శ్రీకాకుళంలో తొలి కేసు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యిని దాటేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1016 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 171 మంది డిశ్చార్జ్ అవగా, కరోనా పాజిటివ్‌తో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆస్పత్రులలో 814మంది చికిత్స పొందుతున్నారు.


అత్యధికంగా కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... అనంతపురంలో 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, శ్రీకాకుళం జిల్లాలలో 3 కేసులు, కర్నూలులో 14, కడప, నెల్లూరులో 4 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61 కేసులు నమోదు అయ్యాయి. తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా 8, గుంటూరు 8, కర్నూలు 9, అనంతపురం 4, నెల్లూరులో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. Updated Date - 2020-04-25T17:51:59+05:30 IST