-
-
Home » Andhra Pradesh » ap cmrf corona effect lock down donations
-
ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు వెల్లువెత్తిన విరాళాలు
ABN , First Publish Date - 2020-05-19T01:51:02+05:30 IST
రోనా మహమ్మారి నివారణకు, లాక్‌డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు గానూ సీఎంఆర్ఎఫ్‌కు ఇవాళ భారీగా విరాళాలు అందాయి. సీఎంఆర్ఎఫ్‌కు అందిన విరాళాల వివరాలు..

అమరావతి: కరోనా మహమ్మారి నివారణకు, లాక్‌డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు గానూ సీఎంఆర్ఎఫ్‌కు ఇవాళ భారీగా విరాళాలు అందాయి. సీఎంఆర్ఎఫ్‌కు అందిన విరాళాల వివరాలు..
కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ట్రైమెక్స్ గ్రూప్ కంపెనీ రూ.2 కోట్లు విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సీఎం జగన్‌కు ట్రైమెక్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రదీప్ కోనేరు అందజేశారు. తోపుదుర్తి మహిళ సహకార డైరీ, రాప్తాడు నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు, నాయకులు సంయుక్తంగా ఇచ్చిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, వేదవ్యాస్, రాజశేఖర్ రెడ్డి, హరిప్రసాద్ చౌదరి కలిసి సీఎం జగన్‌కు అందజేశారు. అదేవిధంగా పల్సన్ గ్రూప్ రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును పల్సన్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు.. సీఎం జగన్‌కు అందజేశారు.