వైఎస్ జగన్ నిన్న ప్రెస్‌మీట్ పెట్టలేదా.. ఈ వీడియో వెనుక కథేంటి!?

ABN , First Publish Date - 2020-04-28T19:35:48+05:30 IST

కరోనా నియంత్రణకై ప్రభుత్వం ఏమేం చేస్తోంది..? ఏపీ ప్రజలు ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..?

వైఎస్ జగన్ నిన్న ప్రెస్‌మీట్ పెట్టలేదా.. ఈ వీడియో వెనుక కథేంటి!?

అమరావతి : కరోనా నియంత్రణకై ప్రభుత్వం ఏమేం చేస్తోంది..? ఏపీ ప్రజలు ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..? కేసుల పరిస్థితి ఎలా ఉంది..? అనేదానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం మీడియా మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలకు తెలియపరిచారు.


అసలేం జరిగింది!?

అయితే అది మీడియా మీట్ కాదని.. ఆల్రెడీ రికార్డింగ్ చేసిన వీడియోను ఎడిట్ చేసి మరీ టెలికాస్ట్ చేయించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అసలు ఇదెలా జరిగింది..? ఇది నిజంగా ప్రెస్‌మీటా కాదా..? అనేదానిపై టీడీపీ అధికారిక ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇది అసలు ప్రెస్ మీట్ కాదని.. రికార్డింగే అని తెలుస్తోంది. మరోవైపు ఈ వీడియోపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు మాత్రం తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు టీడీపీ అధికారిక ఖాతా చేసిన ట్వీట్‌లో ఏముంది..? వీడియోలో ఏముంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. 


మీడియా ముందుకొస్తే..

‘సోమవారం సాయంత్రం సీఎం జగన్ గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అది ప్రత్యక్ష ప్రసారం అనుకుంటే మీరు పొరబడ్డట్టే. అదొక ఎడిట్ చేసిన వీడియో. మన సీఎం కనీసం లైవ్ ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడలేరా? వీడియో పెట్టి మేనేజ్ చేయడం ఏంటి అంటే అదంతే. మాట్లాడితే తప్పులు దొర్లుతాయి మరి..!’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది టీడీపీ. అంతేకాదు.. అసలు ఇది ప్రెస్ మీట్ కాదనేదానిపై పక్కా ఆధారాలు సైతం ఆ వీడియోలో టీడీపీ పేర్కొంది. జగన్ నిన్న మాట్లాడింది ప్రెస్ మీట్‌లో కాదని.. అది రికార్డింగ్ అని సీఎం ధరించిన గడియారమే చెప్పేస్తోంది. ఇమేజ్-01 వీడియోలో 09:27 స్ట్రీమింగ్ టైమింగ్‌‌లో తీసిన స్క్రీన్ షాట్ ఫోటోలో 32:30 నిమిషాలు అని ఉంది. అంటే రెండు స్క్రీన్ షాట్‌ల మధ్యన గ్యాప్ 23 నిమిషాలన్న మాట. 


చేతి గడియారం విషయానికొస్తే.. 

ఇమేజ్-01 విషయానికొస్తే జగన్ చేతిలోని గడియారం మధ్యాహ్నం 01:35 అని చూపిస్తోంది. ఇమేజ్-02లో చూస్తే మధ్యాహ్నం 02:01 గంటలుగా చూపిస్తోంది. అంటే గడియారం లెక్కల ప్రకారం చూస్తే 26 నిమిషాల టైమ్ గ్యాప్ ఉందన్నమాట. 26 నిమిషాల వీడియోలో 23 నిమిషాల వచ్చిందంటే మిగతా మూడు నిమిషాల వీడియో ఏమైనట్టు..? అనేది ప్రశ్నార్థంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో.. అటు మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇటీవల జగన్ వరుసగా తప్పులు మాట్లాడుతుండటంతో వీడియోలు రిలీజ్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో మరి.



Updated Date - 2020-04-28T19:35:48+05:30 IST