లేఖ యుద్ధం జగన్‌ మెడకే చుట్టుకుంటుందా?

ABN , First Publish Date - 2020-10-15T01:25:30+05:30 IST

ఏపీ సీఎం జగన్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ సారాంశం దుమారం గాలివానగా మారుతున్నట్టే కనిపిస్తోంది. ఇది రాజకీయ దుమారంగా...

లేఖ యుద్ధం జగన్‌ మెడకే చుట్టుకుంటుందా?

ఏపీ సీఎం జగన్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ తాలూకు దుమారం గాలివానగా మారుతున్నట్టే కనిపిస్తోంది. ఇది రాజకీయ దుమారంగా కాకుండా న్యాయ వ్యవస్థకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఒక వివాదాస్పద అంశంగా మారిపోవడమే కాకుండా ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పినట్టుగా కనిపిస్తోంది. జగన్ చేసిన పని కోర్టు ధిక్కరణ అని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం, రాసిన లేఖను ప్రభుత్వ సలహాదారుచే అధికారికంగా మీడియాకు రిలీజ్ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు, కోర్టు ధిక్కరణలకు పాల్పడ్డారని కొన్ని సెక్షన్లతో సహా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బుధవారం మరో ఇద్దరు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ‘


 ఈ నేపథ్యంలో ‘‘జగన్‌ది కోర్టు ధిక్కారమేనని తేల్చేసిన న్యాయ నిపుణులు. న్యాయ వ్యవస్థను భయపెట్టే కుట్రేనన్న న్యాయ సమాజం. జగన్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ధ్వజం. దామోదరం సంజీవయ్య రాసిన లేఖతో పోలుస్తున్న అధికార పక్షం. ఆ పెద్దాయనతోనూ ఆ లేఖలతోనూ పోల్చే అర్హత మీకుందా అంటున్న ప్రజలు. లేఖతో మొదలుపెట్టిన యుద్ధం జగన్‌కే బూమరాంగ్ అవుతుందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-10-15T01:25:30+05:30 IST