జగన్ ప్లాన్స్‌కు మోదీ గండి

ABN , First Publish Date - 2020-04-15T01:05:03+05:30 IST

ఏపీ సీఎం జగన్ ప్లాన్స్‌కు భారత ప్రధాని మోదీ గండి కొట్టారు. లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకే విచక్షణాధికారాలు ఇస్తారని...

జగన్ ప్లాన్స్‌కు మోదీ గండి

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ ప్లాన్స్‌కు భారత ప్రధాని మోదీ గండి కొట్టారు. లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకే విచక్షణాధికారాలు ఇస్తారని ఏపీ సీఎం జగన్ భావించారు. అయితే.. లాక్‌డౌన్‌ను మే 3వరకూ పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. మరో మూడు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం వెలువడటంతో ఏపీలో మేలోగా రాజకీయ అజెండా అమలు చేయాలన్న ఆత్రంలో ఉన్న జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.


కరోనా ప్రభావం ఏపీలో అంతగా లేదని కేంద్రాన్ని నమ్మించేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఏపీలో రెడ్‌జోన్లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలన్న భావనను సీఎం జగన్ ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ వ్యక్తపరిచారు. కరోనా వ్యాప్తి కట్టడికి స్థానిక ఎన్నికలను వాయిదా వేసినందుకు ఏకంగా ఎన్నికల కమిషనర్‌ను వైసీపీ ప్రభుత్వం మార్చింది.


ఎన్నికల కమిషనర్‌ను మార్చడం ద్వారా స్థానిక ఎన్నికలను త్వరితగతిన జరిపించుకోవాలన్న జగన్ వ్యూహం.. కేంద్రం ప్రకటనతో అట్టర్ ఫ్లాప్ అయింది. లాక్‌డౌన్ 3 వారాల పొడిగింపుతో సొంత అజెండా అమలు చేసేందుకు జగన్‌కు అవకాశం లేకుండా పోయింది. ఏప్రిల్ 20 తర్వాత కూడా అత్యవసర సర్వీసులకు మాత్రమే షరతులతో మినహాయింపులివ్వడంతో అమరావతి తరలింపు ఎత్తుగడలకూ బ్రేక్ పడింది.

Updated Date - 2020-04-15T01:05:03+05:30 IST