-
-
Home » Andhra Pradesh » AP Capital farmers protest continue Amaravathi
-
87వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు
ABN , First Publish Date - 2020-03-13T13:31:22+05:30 IST
87వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు

అమరావతి: రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళనలు 87వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నా, వెలగపూడిలో 87వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అటు పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు కొనసాగిస్తున్నారు. మిగిలిన రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.