కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2020-03-04T12:54:25+05:30 IST

కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

అమరావతి: మూడు రాజధానులు వద్దు...అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 78వ రోజుకు చేరుకున్నాయి. రైతులు రోజు రోజుకు తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. రాజధానిలో జై అమరావతి నినాదాలు మిన్నంటుతున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు... వెలగపూడిలో 78వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అటు పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమిలో రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజధాని ఇతర గ్రామాల్లోనూ రైతుల ధర్నాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-03-04T12:54:25+05:30 IST