ఏపీలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-18T14:51:27+05:30 IST

హిందూ ఆలయాల‌పై దాడుల‌ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరనగా బీజేపీ ఆందోళనకు దిగింది.

ఏపీలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

అమరావతి: హిందూ ఆలయాల‌పై దాడుల‌ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరనగా బీజేపీ ఆందోళనకు దిగింది. హిందూ‌వాదులను అక్రమంగా అరెస్టులు‌ చేశారంటూ ఈరోజు ఛలో అమలాపురంకు రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా... చలో అమలాపురం ఈరోజు జరిగి తీరుతుందని సోము‌ వీర్రాజు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. 


విశాఖపట్నం: బీజేపీ  పిలుపు మేరకు అమలాపురం - అంతర్వేది  కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న నగర బీజేపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో ప్రజా హక్కులను అణిచివేస్తున్నారని.. పోలీస్  చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని నగర బీజేపీ నేతలు తెలిపారు. 


ప.గో: ఛలో అంతర్వేది నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు.  భీమవరంలో పార్టీ ఉపాధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ,  ఉంగుటూరులో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి,  తాడేపల్లిగూడెంలో నరిసే సోమేశ్వరరావు,  పోలవరంలో నియోజకవర్గ కన్వీనర్ కరిబండి నాగరాజులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 

Updated Date - 2020-09-18T14:51:27+05:30 IST