ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-07-28T02:59:37+05:30 IST

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. సోము వీర్రాజును..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

అమరావతి: ఏపీ బీజేపీలో కీలక మార్పులు జరిగాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. విద్యార్థిగా ఏబీవీపీలో పనిచేసిన  సోము వీర్రాజు.. బీజేపీలో నలభై ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాలతో కన్నాను తప్పించి సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది. 


ఇక నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో  సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ బలమైన రాజకీయ పార్టీగా ముందుకు వెళుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. 


అటు సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై రాజమండ్రి బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా నుంచి తొలిసారిగా ఓ ప్రధాన రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కటంపై జిల్లా వాసులు కూడా హర్షం చేస్తున్నారు.
Updated Date - 2020-07-28T02:59:37+05:30 IST