ఏపీ భవన్‌కు తాళం!

ABN , First Publish Date - 2020-03-24T09:48:46+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లోని అన్ని విభాగాలను మూసివేశారు. ఈ మేరకు రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా ...

ఏపీ భవన్‌కు తాళం!

న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో భాగంగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లోని అన్ని విభాగాలను మూసివేశారు. ఈ మేరకు రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు లోబడి ఏపీ భవన్‌లోని వివిధ విభాగాల ఉద్యోగులు మంగళవారం నుంచి ఇళ్ల నుంచే విధులు నిర్వహించాలని ఆదేశించారు. 60 ఏళ్లు పైబడిన కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఇంటి నుంచే విధులు నిర్వహించవచ్చని తెలిపారు. భవన్‌లో అత్యవసర సర్వీసులైన రిసెప్షన్‌, కరోనా కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తాయని చెప్పారు. 

Read more