కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

ABN , First Publish Date - 2020-06-16T13:13:18+05:30 IST

కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి: మార్చిలో జరగాల్సిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభంకాబోతున్నాయి. కరోనా కారణంగా దాదాపు మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బడ్జెట్ సమావేశాలకు ఈరోజు ముహూర్తం కుదిరింది. మరికాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ రెండు రోజులకే వాటిని కుదించినట్లుగా సమాచారం. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపైన దృష్టి పెడతామని చెబుతున్నాయి. ప్రధానంగా గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన దృష్టిపెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ముందుగా టీడీపీకి సంబంధించిన నేతల అరెస్ట్‌ల అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. బడ్జెట్ సమావేశాలపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, సీపీఎం నేత కందారపు మురళి, బీజేపీ నేత శ్రీరాం, జనసేన నేత శ్రీనివాస్ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. Updated Date - 2020-06-16T13:13:18+05:30 IST