-
-
Home » Andhra Pradesh » AP assembly budget session
-
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇప్పట్లో లేనట్లేనా?
ABN , First Publish Date - 2020-03-25T16:25:13+05:30 IST
అమరావతి: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదాకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం.

అమరావతి: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదాకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. గత 2 రోజులుగా సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించటంతో...ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేనట్టేనని తెలుస్తోంది.
సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా... ఒకటి, రెండు నెలలకు కావాల్సిన బడ్జెట్‌ను ఆమోదం తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.