ఎపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య ముగిసిన చర్చలు

ABN , First Publish Date - 2020-06-19T00:00:15+05:30 IST

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు ముగిశాయి. అయితే ఆర్టీసీ అధికారులు మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించారు.

ఎపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య ముగిసిన చర్చలు

అమరావతి: ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు ముగిశాయి. అయితే ఆర్టీసీ అధికారులు మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించారు. అంతర్ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకునేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీలు ప్రాథమికంగా అంగీకరించాయి. త్వరలో మరోసారి సమావేశమై ఒప్పందంపై చర్చించాలని చేసుకోవాలని సమావేశంలో నిర్ణయం  తీసుకున్నారు. వారం రోజుల్లో తెలంగాణ, ఎపీ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2020-06-19T00:00:15+05:30 IST