బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా 21న ఏవోబీ బంద్‌

ABN , First Publish Date - 2020-12-21T01:36:09+05:30 IST

బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 21 ఏవోబీ బంద్‌కు మావోయిస్టు నేత కైలాసం పిలుపునిచ్చారు. నిద్రిస్తున్న తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు పట్టుకుని కాల్చి

బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా 21న ఏవోబీ బంద్‌

విశాఖ: బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 21 ఏవోబీ బంద్‌కు మావోయిస్టు నేత కైలాసం పిలుపునిచ్చారు. నిద్రిస్తున్న తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని తెలిపారు. పార్టీ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన చిన్న పసిపాపను కూడా చంపారని దుయ్యబట్టారు. పోలీసులు చేస్తున్న హత్యలను నిరసిస్తూ 21న ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని కైలాసం విజ్ఞప్తి చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, బూటకపు ఎన్‌కౌంటర్లతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఎన్‌కౌంటర్ల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కైలాసం ధ్వజమెత్తారు.  ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో సింగవరం గ్రామంలో ఈ నెల 12వ తేదీన ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

Updated Date - 2020-12-21T01:36:09+05:30 IST