అసభ్య పోస్టింగులపై చర్యలేవీ?
ABN , First Publish Date - 2020-10-19T07:09:54+05:30 IST
సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ కార్యకర్తలు తమపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా..

అమరావతి రైతులు, మహిళల ఆందోళన
గుంటూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ కార్యకర్తలు తమపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదని అమరావతి మహిళలు మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం తుళ్లూరులో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 306వ రోజుకు చేరాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న తమపై సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తుళ్లూరు పోలీసుస్టేషన్లో మహిళా రైతులు ఫిర్యాదు చేశారు.