అంతర్వేది ఆలయ ర‌థం ద‌గ్ధంతో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతిన్నాయి: లోకేష్

ABN , First Publish Date - 2020-09-06T22:10:46+05:30 IST

అంతర్వేది ఆలయ ర‌థం ద‌గ్ధంతో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. ఆల‌యాల‌ను అప‌విత్రం చేస్తూ రాజ‌కీయాల‌కు వేదిక‌గా వాడుకుంటున్నారని ఆక్షేపించారు.

అంతర్వేది ఆలయ ర‌థం ద‌గ్ధంతో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతిన్నాయి: లోకేష్

రాజమండ్రి: అంతర్వేది ఆలయ ర‌థం ద‌గ్ధంతో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. ఆల‌యాల‌ను అప‌విత్రం చేస్తూ రాజ‌కీయాల‌కు వేదిక‌గా వాడుకుంటున్నారని ఆక్షేపించారు. వైసీపీ హ‌యాంలో ర‌థం కాలిపోవ‌డం రాష్ట్రానికే అరిష్టమని పండితులు అంటున్నారని, ర‌థం ద‌గ్ధం కావ‌డానికి కార‌కులెవ‌రో గుర్తించి క‌ఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రథం పూర్తిగా దగ్ధమైంది. ఆలయ ప్రాంగాణంలో ఉంటున్న ఈ రథానికి 60 ఏళ్ల చరిత్ర ఉంది. స్వామి వారి రథానికి మంటలు అంటుకోవడంపై ఆలయ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎవరైనా దుండగులు నిప్పంటించారా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-06T22:10:46+05:30 IST