కరోనా ఘర్షణలో మరో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-04-08T17:20:56+05:30 IST
అనంతపురం: కరోనా నేపథ్యంలో జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి మృతి చెందాడు.

అనంతపురం: కరోనా నేపథ్యంలో జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామంలో కరోనా కంచె వివాదంలో భాగంగా జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి మృతి చెందాడు. కరోనా కంచె వివాదంలో రెండు రోజుల క్రితం గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరప్ప కొట్టాలకు చెందిన పోతుల కాటమయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇదే ఘర్షణలో తీవ్రంగా గాయపడిన భీమన్న కొట్టాలకు చెందిన రాజు చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. దీంతో ఈదుల ముష్టూరు గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది. పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.