సౌరవిద్యుత్‌కు కొత్తగా మరో కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2020-02-16T10:03:17+05:30 IST

సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కోసం కొత్తగా మరో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ హరిత విద్యుత్‌ కార్పొరేషన్‌ పేరుతో దీన్ని

సౌరవిద్యుత్‌కు కొత్తగా మరో కార్పొరేషన్‌

హరిత విద్యుత్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు 

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కోసం కొత్తగా మరో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ హరిత విద్యుత్‌ కార్పొరేషన్‌ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి సాయిప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికే ఒక సౌరవిద్యుత్‌ కార్పొరేషన్‌ పనిచేస్తోంది. అది ఉండగానే ఇప్పుడు మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. పది వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటును ఈ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. కొత్త కార్పొరేషన్‌ ఏపీ జెన్‌కోకు నూరు శాతం అనుబంధ సంస్థగా ఉంటుంది. దీని నిర్వహణకయ్యే ఖర్చు, జీతభత్యాలు జెన్‌కో భరిస్తుంది. తర్వాత ఆ వ్యయాన్ని జెన్‌కోకు కొత్త కార్పొరేషన్‌ తిరిగి చెల్లిస్తుంది. దీనికి కావాల్సిన వసతి కూడా జెన్‌కోనే ఏర్పాటు చేస్తుంది. ఇందులో అవసరమైన అధికారులు, ఇంజనీర్లు, సిబ్బందిలో కొందరిని ప్రస్తుత ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు సమకూరుస్తాయి. మరికొంత మందిని అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమిస్తారు. దీనికి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఒక ఐఏఎస్‌ అధికారి ఉంటారు. 

Updated Date - 2020-02-16T10:03:17+05:30 IST