విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు.. ఆందోళన వద్దు: కలెక్టర్ వినయ్

ABN , First Publish Date - 2020-03-27T20:51:54+05:30 IST

విశాఖ: విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. అయితే ప్రస్తుతం పాజిటివ్ వచ్చి వ్యక్తి పాత రోగి బంధువుగా గుర్తించారు.

విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు.. ఆందోళన వద్దు: కలెక్టర్ వినయ్

విశాఖ: విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. అయితే ప్రస్తుతం పాజిటివ్ వచ్చి వ్యక్తి పాత రోగి బంధువుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆందోళన అవసరం లేదని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. 112 శాంపిల్స్‌ను లాబ్‌కి పంపగా 4  పాజిటివ్.. 90 నెగెటివ్ వచ్చాయని... మిగిలినవి ఇంకా లాబ్ నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. 3550 బెడ్స్‌ను క్వారంటైన్ కోసం సిద్ధం చేశామని.. ఐసొలేషన్ కోసం 2000 బెడ్స్‌ను సిద్ధం చేశామన్నారు. విదేశాల్లో ఉండి వచ్చిన వారు 2795 మంది ఉన్నారన్నారు. వీరంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారని.. వీరందరు ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పరిశీలిస్తామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.


Updated Date - 2020-03-27T20:51:54+05:30 IST