కొవిడ్‌కు మరో 91మంది బలి ..
ABN , First Publish Date - 2020-08-22T08:57:56+05:30 IST
రాష్ట్రంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. గురువారం 55,010మందికి పరీక్షలు నిర్వహించగా 9,544మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు ..
కొత్త కేసులు 9,544
మొత్తం 3,34,940
3,092కు చేరిన మరణాలు
నెల్లూరు కార్పొరేషన్‌లో
31మంది ఉద్యోగులకు వైరస్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. గురువారం 55,010మందికి పరీక్షలు నిర్వహించగా 9,544మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 3,34,940కి చేరాయి. తాజాగా 8,827 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 2,44,045మంది డిశ్చార్జి కాగా, 87,803మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 91మంది కొవిడ్‌కు బలయ్యారు.
చిత్తూరులో 16మంది, పశ్చిమగోదావరిలో 13మంది, నెల్లూరులో 12మంది, తూర్పుగోదావరిలో 11మంది, అనంతపురంలో 8మంది, కడపలో ఏడుగురు, విశాఖలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 3,092కు పెరిగాయి. తూర్పుగోదావరిలో మరో 1,312మందికి వైరస్ సోకింది. జిల్లాలో మొత్తం కేసులు 46,668కి చేరాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 919మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.విశాఖ జిల్లాలో మరో 738మంది వైరస్ బారినపడ్డారు. జిల్లాలో ఇప్పటివరకూ 29,225మందికి కరోనా సోకింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా 761 పాజిటివ్‌లు నమోదయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 31మంది ఉద్యోగులకు కరోనా సోకింది. చిత్తూరులో 735, అనంతపురంలో 704, శ్రీకాకుళంలో 571, గుంటూరులో 358, కడపలో 343, కృష్ణాజిల్లాలో 265 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి.