చెల్లెమ్మలను కాపాడలేనివాడు అన్నా?!

ABN , First Publish Date - 2020-12-26T07:15:22+05:30 IST

‘‘చెల్లెమ్మలను కాపాడలేనివాడు అన్న ఎలా అవుతాడు?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

చెల్లెమ్మలను కాపాడలేనివాడు అన్నా?!

సీఎం జగన్‌పై బుద్దా వెంకన్న ఆగ్రహం

విజయవాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘చెల్లెమ్మలను కాపాడలేనివాడు అన్న ఎలా అవుతాడు?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. ‘‘బుల్లెట్‌ కంటే వేగంగా వస్తాడన్న జగన్‌రెడ్డి రాడే? దిశ చట్టం ఓ అబద్ధం. రోజుకో మహిళ బలైపోవడం నిజం. ఇంకెంతమంది మహిళలు బలైతే తాడేపల్లి కోటలో మొద్దునిద్రపోతున్న జగన్‌రెడ్డి నిద్రలేస్తారు?’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-12-26T07:15:22+05:30 IST