-
-
Home » Andhra Pradesh » anjaneyulu arrest
-
ఆంజనేయులు అరెస్ట్ అన్యాయం
ABN , First Publish Date - 2020-12-10T22:12:56+05:30 IST
మదనపల్లె వైఎస్సార్ కాలనీలో మాజీ మావోయిస్టు ఆంజనేయులును పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని పౌరహక్కుల నేత నాగేశ్వరరావు అన్నారు.

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె వైఎస్సార్ కాలనీలో మాజీ మావోయిస్టు ఆంజనేయులును పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని పౌరహక్కుల నేత నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు పోలీసులు, మావోయిస్టుల్లో చేరేలా యువతను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవడం లేదన్నారు. కావాలని నచ్చని వారిపై కేసులు పెడుతూ.. అరెస్టులు చేస్తున్నారని ఆక్షేపించారు. ఆంజనేయులును ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనను విడిచి పెట్టాలని లేకపోతే నిరసనలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు అరెస్ట్‌ను ఆయన ఖండించారు.