ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆగంతకులు

ABN , First Publish Date - 2020-09-25T17:14:05+05:30 IST

నెల్లూరు: నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరు ప్రాంతంలో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు.

ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆగంతకులు

నెల్లూరు: నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరు ప్రాంతంలో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. తల, తోక భాగంలో విగ్రహం దెబ్బతిన్నది. డీఎస్ఫీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ని పోలీసులు రప్పిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-25T17:14:05+05:30 IST