తనకు రక్షణ లేదని.. ప్రాణహాని ఉందని సుధాకర్ చెప్పారు: అనిత
ABN , First Publish Date - 2020-05-29T20:11:48+05:30 IST
అమరావతి: డాక్టర్ సుధాకర్ తల్లి ఉదయం తనకు ఫోన్ చేసి డాక్టర్ రామిరెడ్డి వలన సుధాకర్‌కు హాని ఉందని చెప్పారని..

అమరావతి: డాక్టర్ సుధాకర్ తల్లి ఉదయం తనకు ఫోన్ చేసి డాక్టర్ రామిరెడ్డి వలన సుధాకర్‌కు హాని ఉందని చెప్పారని తెలుగు మహిళ అధ్యాక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. తనకు ఇక్కడ రక్షణ లేదని.. తనకు ప్రాణహాని ఉందని డాక్టర్ సుధాకర్ చెబుతున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డిని, అతని మంత్రి వర్గాన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలన్నారు. ఇప్పటికి కూడా డాక్టర్ సుధాకర్‌కు మాస్కులు ఇవ్వడం లేదని అనిత పేర్కొన్నారు.