-
-
Home » Andhra Pradesh » anitha comments on jagan
-
మీ పేద మేనకోడలిని బాల కార్మికులరాలిని చేస్తారా?: జగన్‌పై అనిత ఫైర్
ABN , First Publish Date - 2020-05-18T20:16:49+05:30 IST
అమరావతి: ఏపీతో పిల్లలందరికీ తనను తాను మేనమామగా ప్రకటించుకున్న జగన్.. తన పేద మేనకోడలిని మాత్రం బడికి..

అమరావతి: ఏపీతో పిల్లలందరికీ తనను తాను మేనమామగా ప్రకటించుకున్న జగన్.. తన పేద మేనకోడలిని మాత్రం బడికి పంపించకుండా కార్మికురాలిని చేశారంటూ టీడీపీ నాయకురాలు అనిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. దిశ చట్టం అమలవుతున్నట్టు చెప్పుకునే రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు బాలికపై అత్యాచారాలు జరిగాయని మండిపడడ్డారు.
‘‘ఏపీలో పిల్లలందరికీ తాను మేనమామగా జగన్ ప్రకటించుకున్నారు. మీ పేద మేనకోడలిని ఆత్మకూరులో బడికి పంపకుండా బాల కార్మికురాలిని చేశారు. దిశ చట్టం అమలవుతున్నట్లు చెప్పుకునే రాష్ట్రంలో.. ఒకే రోజు ఇద్దరు బాలికలపై అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో’’ అని అనిత ట్వీట్‌లో పేర్కొన్నారు.