వైసీపీ మహిళ కమిషన్‌పై అనిత కామెంట్స్

ABN , First Publish Date - 2020-06-22T20:09:58+05:30 IST

వైసీపీ పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాలపై మహిళ కమిషన్ ఎందుకు పోరాటం చేయలేదని

వైసీపీ మహిళ కమిషన్‌పై అనిత కామెంట్స్

విశాఖపట్టణం: వైసీపీ పాలనలో మహిళలకు జరిగిన అన్యాయాలపై మహిళ కమిషన్ ఎందుకు పోరాటం చేయలేదని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడిపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఏడాదిలో 400 పైగా చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరిగాయని, గ్యాంగ్ రేపులు, హత్యలు జరిగాయని.. వీటన్నిటిపై ఏ రోజూ స్పందించని మహిళ కమిషన్.. ఇవాళ అయ్యన్న పాత్రుడు విషయంలో.. ఎట్టి పరిస్థితులోనైనా అయ్యన్నను అరెస్టు చేస్తామని, ఆయన అరెస్టు ఒక మార్గదర్శకమవుతుందని చెబుతున్నారని విమర్శించారు. ఇన్ని రోజులు సీఎం జగన్ మాట్లాడమని చెప్పాలేదా? అని ప్రశ్నించారు. ఏడాదిలో జరిగినవి వదిలేసి.. ఇప్పుడు అయ్యన్న పాత్రుడుపై కేసు పెట్టడం నిజంగా సిగ్గనిపిస్తోందని అన్నారు. అయ్యన్నపై నిర్భయ కేసు ఫైల్ చేశామని చెబుతున్న పేటీఎం బ్యాచ్‌ను చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు.

Updated Date - 2020-06-22T20:09:58+05:30 IST